'గాయపడ్డ సింహం'లో నా క్యారెక్టర్ ను ఆడియన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు: ఫరియా అబ్దుల్లా

  • హిలేరియస్ ఎంటర్టైనర్‌గా గాయపడ్డ సింహం
  • ఈ చిత్రంలో ఫన్ వైబ్ ఉన్న వ్లాగర్ పాత్రలో ఫరియా
  • తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని వెల్లడి
  • శ్రీవిష్ణు స్పెషల్ రోల్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ
  • మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
దర్శకుడిగా, నటుడిగా విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న తరుణ్ భాస్కర్ హీరోగా, యువ దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న కొత్త చిత్రం 'గాయపడ్డ సింహం'. ఈ సినిమాలో హీరో శ్రీవిష్ణు ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుండటం విశేషం. పవన్ సాదినేని సమర్పణలో సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించగా, జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం సందర్భంగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా విలేకరులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఫరియా మాట్లాడుతూ, "'గాయపడ్డ సింహం'లో నేను ఒక మంచి క్యామియో రోల్ చేశాను. నా పాత్ర పేరు శాలిని, ఒక వ్లాగర్. ఇందులో మంచి ఫన్ వైబ్ ఉంటుంది. తరుణ్ గారితో ఒక రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుంది. ఇది మల్టిపుల్ లేయర్స్‌లో జరిగే కథ. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. నా క్యారెక్టర్‌లో కామెడీ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. దర్శకుడు కశ్యప్ క్రియేట్ చేసిన ప్రపంచం, పాత్రలు అన్నీ చాలా హిలేరియస్‌గా వచ్చాయి. సినిమా చూసిన ప్రేక్షకులకు మళ్లీ చూడాలనిపిస్తుంది" అని తెలిపారు.

తరుణ్ భాస్కర్‌తో కలిసి పనిచేయడంపై స్పందిస్తూ, "తరుణ్ గారు చాలా సరదాగా ఉంటారు. ఆయన కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్. ఆయనతో సీన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఆయన చిన్న ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినా నాకు నవ్వు వచ్చేస్తుంది. సినిమా ఫైనల్ అవుట్‌పుట్ చూశాను, చాలా అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని ఫరియా అన్నారు. శ్రీవిష్ణు పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుందని, ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆమె పేర్కొన్నారు.

దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ, "కశ్యప్ గారి కామెడీ టైమింగ్ చాలా పెక్కులర్‌గా ఉంటుంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ వంటి అన్ని అంశాలను కలిపి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన కూడా ఈ సినిమాలో ఒక పాత్రలో నటించారు, ఆయన నటన, దర్శకత్వం రెండూ అద్భుతంగా ఉన్నాయి" అని ప్రశంసించారు. 

ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి, పవన్ సాదినేని వంటి దర్శకులు ఉండటం మంచి అనుభవమని, 'సత్య' నుంచి 'పెళ్లి చూపులు' వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లమని గుర్తుచేసుకున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం అందించిన 'బ్రైడ్', 'జింగాల' పాటలు తన ఫేవరెట్స్ అని ఫరియా తెలిపారు. ప్రస్తుతం తాను 'భగవంతుడు', 'సిగ్మా' చిత్రాలతో పాటు సత్యదేవ్‌తో ఒక సినిమాలో నటిస్తున్నానని, వచ్చే ఏడాది దర్శకత్వం చేసే ఆలోచనలో ఉన్నానని తన భవిష్యత్ ప్రణాళికలను పంచుకున్నారు.

Gayapadda Simham
Faria Abdullah
Tarun Bhasker
Kashyap Srinivas
JD Chakravarti

More Telugu News